జమ్మూ కాశ్మీర్లో భారీగా పట్టుబడిన ఆయుధాలు, మందు గుండు సామాగ్రి
జమ్మూ కాశ్మీర్, 12 సెప్టెంబర్ (హి.స.) అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారీగా ఆయుధాలు,మందుగుండు సామగ్రి పట్టుబడింది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కుప్వారాలోని కెరాన్సెక్టార్లో
జమ్మూ కాశ్మీర్లో ఆయుధాలు పట్టివేత


జమ్మూ కాశ్మీర్, 12 సెప్టెంబర్ (హి.స.)

అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ

కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారీగా ఆయుధాలు,మందుగుండు సామగ్రి పట్టుబడింది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్

పోలీసులు సంయుక్తంగా కుప్వారాలోని కెరాన్సెక్టార్లో గురువారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు చెందిన రెండు రహస్య స్థావరాలను గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి 100కు పైగా ఏకే 47 తుపాకులు, హ్యాండ్ గ్రనేడ్లు, ఐఈడీ బాంబులు,

పేలుడుకు సంబంధించిన ఇతర మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్లో మొదటి దశ ఎన్నికలకు మరో

ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. అంతేగాక ఎన్నికల ప్రచారం నిమిత్తం మోడీ ఈ నెల 14న కశ్మీర్లో

పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందే పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో అధికారులు ఒక్క సారిగా

ఉలిక్కిపడ్డారు. మరోవైపు బుధవారం కథువా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు

ఉగ్రవాదులు హతమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande