భారీ హెరాయిన్ నెట్వర్క్ ను ఛేదించిన అండమాన్ పోలీసులు.. 14 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఏడుగురు అరెస్ట్
అండమాన్ నికోబార్, 12 సెప్టెంబర్ (హి.స.) అండమాన్ నికోబార్ పోలీసులు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపారు. భారీ హెరాయిన్ నెట్ వర్ను ఛేదించారు. 2.075 కిలోల బరువున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సౌత్ అండమాన్ ఎస్పీ నిహారక భట్ గురువారం వెల్లడించారు
అండమాన్  లో భారీ హెరాయిన్ స్వాధీనం


అండమాన్ నికోబార్, 12 సెప్టెంబర్ (హి.స.)

అండమాన్ నికోబార్ పోలీసులు

డ్రగ్స్పై ఉక్కుపాదం మోపారు. భారీ హెరాయిన్ నెట్ వర్ను ఛేదించారు. 2.075 కిలోల బరువున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సౌత్ అండమాన్ ఎస్పీ నిహారక భట్ గురువారం వెల్లడించారు. ఓ వ్యక్తి వద్ద భారీగా హెరాయిన్ ఉందని గత నెల 24న పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో పక్కా సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి 1.295 కేజీల హెరాయిన్ గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టగా.. మరో ముగ్గురి గురించిన సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్కతాలో జరిపిన సోదాల్లో 798 గ్రాముల హెరాయిన్ లభ్యమైంది. మొత్తంగా సీజ్ చేసిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande