అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)
: ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. పూర్తిగా నీటమునిగిన ఇళ్లకు రూ.20 నుంచి 25 వేలు రూపాయలు అందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ మాదిరిగా మునిగిన ఇళ్లకు రూ.10 వేలు ఇచ్చే యోచన ఉన్నట్టు సమాచారం. మోటార్ సైకిళ్ల మరమ్మతులకు రూ.3 వేలు, ట్యాక్సీలకు రూ.10 వేలు చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై అధికారుల ప్రతిపాదనలను పరిశీలించి ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది. ఆర్థిక సాయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల