అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి, సెప్టెంబర్ 11: ప్రకాశం బ్యారేజ్ బోట్స్ తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రేన్స్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నది లోపలికి వెళ్లి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న బోట్స్‌ను కట్ చెయ్యాలి అధికారులు నిర్ణయించారు. మొత్తం నాలుగు బోట్లు ఒకదానికి ఒకటి గుద్దుకుని ఇరుక్కుపోవడంతో తొలగింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విశాఖపట్నం, కాకినాడ నుంచి బోట్ కటింగ్ స్క్రూ డ్రైవర్స్‌ను బెకెం సంస్థ పిలిపించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల