సుప్రీం ఆదేశాలు బేఖాతరు
కోల్‌కతా 11 సెప్టెంబర్ (హి.స.): పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల, ఆసుపత్రికి చెందిన జూనియర్‌ వైద్యులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. ఆందోళన పథం వీడి మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలన్న సర్వోన్నత న్యాయస్
sc


కోల్‌కతా 11 సెప్టెంబర్ (హి.స.): పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల, ఆసుపత్రికి చెందిన జూనియర్‌ వైద్యులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. ఆందోళన పథం వీడి మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలన్న సర్వోన్నత న్యాయస్థానం సూచనను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించారు. ‘‘కోల్‌కతా పోలీస్‌ కమిషనర్, ఆరోగ్య కార్యదర్శి, హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్‌లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాము. హత్యాచార బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి’’ అని వైద్యులు తేల్చి చెప్పారు. కోల్‌కతా హత్యాచార ఘటనపై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్‌ ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికను పరిశీలించిన సంగతి తెలిసిందే

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande