సెమీ కండక్టర్‌ల రంగంలో భారత్‌ విశ్వసనీయ భాగస్వామిగా ఎదగడం ఖాయం: మోదీ
దిల్లీ: , 11 సెప్టెంబర్ (హి.స.)ప్రజాస్వామ్యం, సాంకేతికత కలగలసిన భారత్‌ మానవ సంక్షేమానికి భరోసా కల్పిస్తోందని, అదే సమయంలో భిన్న సెమీ కండక్టర్ల సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే సత్తా దేశానికి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప
modiji


దిల్లీ: , 11 సెప్టెంబర్ (హి.స.)ప్రజాస్వామ్యం, సాంకేతికత కలగలసిన భారత్‌ మానవ సంక్షేమానికి భరోసా కల్పిస్తోందని, అదే సమయంలో భిన్న సెమీ కండక్టర్ల సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే సత్తా దేశానికి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం స్థిరమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం తన నివాసంలో జరిగిన సెమీ కండక్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల (సీఈవోలు) రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఈవోల ఆలోచనలు వారి కంపెనీలను తీర్చిదిద్దడమే కాకుండా.. దేశ భవిష్యత్తుకూ మార్గం చూపుతాయని మోదీ పేర్కొన్నారు. రానున్న కాలమంతా టెక్నాలజీతోనే నడుస్తుందని, డిజిటల్‌ కాలానికి సెమీ కండక్టర్‌ అనేది కనీస అవసరమని, భవిష్యత్తులో కనీస అవసరాలకూ సెమీ కండక్టర్లు ఆలంబనగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande