తెలంగాణ/ఏ.పీ, 14 జనవరి (హి.స.) ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం, హిందువుల ఆధ్యాత్మిక కార్యక్రమం “మహా కుంభమేళ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమునా, సరస్వతి నదులు త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళకి ఏకంగా 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. 2025 మహాకుంభ మేళా అధికారికంగా ప్రారంభమైంది. మొదటి రోజే, 5 మిలియన్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. మనదేశం నుంచే కాకుండా బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, అమెరికా, స్పెయిన్ వంటి దేశాల నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ‘మహా కుంభమేళ' గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలల్లో కూడా కుంభమేళ ట్రెండింగ్ టాపిక్గా మారింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మన దాయాది పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ తర్వాత ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ దేశాల్లోని ప్రజలు కుంభమేళ గురించి సెర్చ్ చేవారు. ఈ దేశాలే కాకుండా నేపాల్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్, థాయిలాండ్, అమెరికాలో కూడా ప్రజలు మహాకుంభ్ గురించి చదువుతున్నారు, సెర్చ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..