రియాద్ పర్యటకు బయలుదేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
హైదరాబాద్,న్యూఢిల్లీ జనవరి (హి.స.) సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న *‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’* లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ బయలుదేరి వెళ్ళారు. *'టువర
రియాద్ పర్యటకు బయలుదేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి* 


హైదరాబాద్,న్యూఢిల్లీ జనవరి (హి.స.)

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న *‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’* లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ బయలుదేరి వెళ్ళారు. *'టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్' (Towards Grand Agreement)* థీమ్ తో ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై ఈ సందర్భంగా విస్తృతమైన చర్చ ఉంటుంది.

అనంతరం వివిధ దేశాల గనుల శాఖ మంత్రులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.

ఈ కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రులు, కంపెనీల సీఈవోలు ఈ కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్నారు. ఖనిజ సంపదపై ఫలప్రదమైన చర్చ జరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖనిజ సంపద సద్వినియోగం అవ్వాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా ప్రభుత్వం రియాద్ వేదికగా మూడేళ్లుగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande