ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ న్యూ లుక్.. మ్యాడ్ కు సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న మ్యా డ్ స్క్వేర్..
సినిమా, 18 సెప్టెంబర్ (హి.స.) ఎన్టీఆర్ బామ్మర్ది గా తెలుగు సినీ ఇండీస్ట్రీకి పరిచయమైన నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆయ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం మనకీ తెలిసిందే. మొదటి మూవీ మ్యాడ్ తో కామెడీ ఎంటర్టైనర్ తో
మ్యాడ్ కు సీక్వెల్ గా రానున్న మ్యాడ్ స్క్వేర్


సినిమా, 18 సెప్టెంబర్ (హి.స.)

ఎన్టీఆర్ బామ్మర్ది గా తెలుగు సినీ

ఇండీస్ట్రీకి పరిచయమైన నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆయ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం మనకీ తెలిసిందే. మొదటి మూవీ మ్యాడ్ తో కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీలో నార్నె నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు హీరోలుగా నటించారు.

గతేడాది మ్యాడ్ చిన్న మూవీ గా వచ్చి పెద్ద హిట్ అయి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ఆ మూవీకి సీక్వెల్ ప్రకటించారు. మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకం పై వస్తుంది. తాజాగా ఈ రోజు మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ముగ్గురు పంచెకట్టులో మెరిశారు. మ్యాడ్ మూవీకి ఈ లుక్ కి కొంచం కూడా సంబంధమే లేదు. ఈ మూవీ ఎలా ఉంటుంది.. ఇంకెంత బాగా ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి. అంతే కాకుండా అలాగే ఈ మూవీ మొదటి పాట సెప్టెంబర్ 20న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande