సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన నటి శకుంతల
తెలుగు, 18 సెప్టెంబర్ (హి.స.) సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సిఐడి శకుంతల(84) తీవ్ర అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఛాతిలో నొప్పితో బెంగళూరు లోని ఓ ఆసుపత్రితో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
నటి శకుంతల మృతి


తెలుగు, 18 సెప్టెంబర్ (హి.స.)

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సిఐడి శకుంతల(84) తీవ్ర అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఛాతిలో నొప్పితో బెంగళూరు లోని ఓ ఆసుపత్రితో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 లకు పైగా మూవీస్, డైలీ సీరియల్ ఆమె యాక్ట్ చేశారు. అదేవిధంగా తమిళ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా వెలుగొందిన ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి మహానటులతో ఆమె కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన బుద్దిమంతుడు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన నేనూ మనిషినే లాంటి చిత్రాల్లో నటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande