రిపీట్ కాబోతున్న చిరంజీవి & త్రిష మరియు నాగచైతన్య & సాయి పల్లవి కాంబినేషన్లు..
సినిమా, 19 సెప్టెంబర్ (హి.స.) స్టోరీ మంచిగున్నప్పుడు సాధారణంగా కాంబినేషన్లు రిపీట్ అవుతుంటాయి. ఒక కథలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే ఇంకో కథ కూడా వీరిద్దరూ వస్తే బావుండు అని చాలా మంది కోరుకుంటారు. స్క్రీన్ మీద హీరో - హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతు
ఎంటర్టైన్మెంట్ న్యూస్


సినిమా, 19 సెప్టెంబర్ (హి.స.)

స్టోరీ మంచిగున్నప్పుడు సాధారణంగా కాంబినేషన్లు రిపీట్ అవుతుంటాయి. ఒక కథలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే ఇంకో కథ కూడా వీరిద్దరూ వస్తే బావుండు అని చాలా మంది కోరుకుంటారు. స్క్రీన్ మీద హీరో - హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతుంటే మాత్రం బిజినెస్ కూడా పెరుగుతుంది. అలా సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న కొన్ని జంటల కాంబినేషన్ త్వరలో రిపీట్ కానుంది.

తమిళంలోనే కాకుండా.. తెలుగులో కూడా రిపీటెడ్ అయినా కాంబోలు ఉన్నాయి. ఆలా మళ్ళీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. విశ్వంభర మూవీతో ఆడియెన్స్ ను అలరించడానికి సిద్ధమవుతున్నారు చిరంజీవి అండ్ త్రిష. వీరిద్దరూ స్టాలిన్లో మూవీలో అదర గొట్టారు. ఇప్పుడు వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లవ్ స్టోరీ మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన జంట నాగ చైతన్య, సాయిపల్లవి. ఆ స్టోరీతో

మెప్పించిన ఈ ఫేవరేట్ జోడీ త్వరలోనే తండేల్తో మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు.

అనుకున్న ప్రకారమే షూటింగ్ అయిపోతే ఈ ఏడాది డిసెంబర్లోనే తండేల్ మూవీ వస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande