తిరుమల లడ్డూ.లో నెయ్యి కల్తీ.వ్యవహారం సుప్రీం కోర్టు.కు చేసింది
విజయవాడ, 30 సెప్టెంబర్ (హి.స.) : తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జ
తిరుమల లడ్డూ.లో నెయ్యి కల్తీ.వ్యవహారం సుప్రీం కోర్టు.కు చేసింది


విజయవాడ, 30 సెప్టెంబర్ (హి.స.)

: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. లడ్డూలో జంతువుల కొవ్వు, పంది నెయ్యి కలిపారనే అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదే అంశంపై ఏపీలో అధికార టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande