ఏపిలో వరద బాధితులకు ఉద్యోగసంఘాల.జెఎసి నేతలు భారీ విరాళం
అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.) విజయవాడ: ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్‌ నెల జీతంలో ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. పెన్ష
ఏపిలో వరద బాధితులకు ఉద్యోగసంఘాల.జెఎసి నేతలు భారీ విరాళం


అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)

విజయవాడ: ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్‌ నెల జీతంలో ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని జేఏసీ నేతలు కేవి శివారెడ్డి, విద్యాసాగర్‌ తదితరులు బుధవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయం నిమిత్తం మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు విరాళం అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande