హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.)
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి
లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఏపీకి కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణకు రూ. కోటిని సీఎంకు స్వయాన అందజేస్తానని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత
పవన్ కల్యాణ్ నిజమైన బాహుబలి
అనిపించుకున్నారు. వరద బాధితులకు భారీ మొత్తాన్ని
విరాళంగా అందించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో కోటి చొప్పున రెండు కోట్లు విరాళంగా అందించిన పవన్ కల్యాణ్.. తాజాగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం ఇవ్వాలని
నిర్ణయించారు. దీంతో మొత్తంగా ఆయన చేసిన సాయం
రూ.6 కోట్లకు చేరింది. ఇప్పటివరకు ఇంత మొత్తంలో ఎవరూ అందించలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్
పంచాయతీరాజ్ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్య వేక్షిస్తుండంతో పాటు, ఎప్పటికప్పుడు
అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కాగా,ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ మొత్తంలో సాయం అందింది. ప్రభాస్ సైతం రెండు కోట్లు అందించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి, జూనియర్ ఎన్టీఆర్ కోటి, మహేశ్ బాబు కోటి, అల్లు అర్జున్ కోటి సహా అనేక మంది విరాళాలు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్