రాహుల్‌ గాంధీని కలిసిన రెజ్లర్లు వినేశ్‌, బజ్‌రంగ్‌.. రాజకీయ అరంగేట్రం ఖాయమే?
దిల్లీ, 4 సెప్టెంబర్ (హి.స.)భారత స్టార్‌ రెజ్లర్‌లు వినేశ్ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియాలు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం కాశ్మీర్‌కు వెళ్లే ముందు రెజ్లర్లలతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ తమ
రాహుల్‌


దిల్లీ, 4 సెప్టెంబర్ (హి.స.)భారత స్టార్‌ రెజ్లర్‌లు వినేశ్ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియాలు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం కాశ్మీర్‌కు వెళ్లే ముందు రెజ్లర్లలతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లు వినేశ్‌, బజ్‌రంగ్‌లు రాహుల్‌తో సమావేశమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సోమవారం సమావేశం అయింది. ఎన్నికల్లో పోటీ చేసే 34 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు హరియాణా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande