భద్రాద్రి జిల్లాలో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.. ఆరుగురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం, 5 సెప్టెంబర్ (హి.స.) భద్రాద్రి జిల్లాలో గురువారం మళ్లీ కాల్పుల మోత మోగింది. కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ
భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు


భద్రాద్రి కొత్తగూడెం, 5 సెప్టెంబర్ (హి.స.)

భద్రాద్రి జిల్లాలో గురువారం మళ్లీ

కాల్పుల మోత మోగింది. కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఆడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ క్రమంలోనే రెండు వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి. అయితే, ఈ కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande