స్పోర్ట్స్, 6 సెప్టెంబర్ (హి.స.)
భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్ గూటికి చేరారు.
కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక, వినేష్ ఫోగట్, భజరంగ్ పునియా ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని కూడా కలిశారు. ఇకపోతే, రోడ్ నంబర్ 10, రాజాజీ మార్గ్ లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత
కేసీ వేణుగోపాల్ తో ఇద్దరు రెజ్లర్లు భేటీ య్యారు. చక్ దే ఇండియా, చక్ దే హర్యానా! ప్రపంచంలో భారతదేశం
గర్వపడేలా చేసిన మా ప్రతిభావంతులైన చాంపియన్లు వినేష్ ఫోగట్, భజరంగ్ పునియాలతో భేటీ అయ్యాను.
మీ ఇద్దర్ని చూసి గర్విస్తున్నా అని ఖర్గే సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్ల చేరికతో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాగా, వీరిద్దరూ హస్తం పార్టీలో చేరడంతో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. వినేశ్,భజరంగ్ చేరిక వల్లే హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించలేదని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్