యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ నుండి మరో అప్డేట్
సినిమా, 7 సెప్టెంబర్ (హి.స.) యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ 'దేవర'. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. అయితే దేవర సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల
దేవర మూవీ నుండి మరో అప్డేట్


సినిమా, 7 సెప్టెంబర్ (హి.స.)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ 'దేవర'. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. అయితే దేవర సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. మేకర్స్ దేవర నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయడంతో భారీ రెస్పాన్స్ను దక్కించుకున్నాయి.

తాజాగా, వినాయక చవితి సందర్భంగా మేకర్స్ దేవర

నుంచి అప్డేట్ను విడుదల చేశారు. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

పూనకాలు ఖాయం అని ఫైర్ ఎమోజీని షేర్ చేశారు.

అయితే 2 నిమిషాల 45 సెకన్లు ఉన్న ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసేలా ఉండబోతున్నట్లు టాక్.యూట్యూబ్లో పాటుగా ఎంపిక చేసుకున్న

థియేటర్స్లోనూ ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande