తెలంగాణ, జనవరి 13 (హి.స) ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద మహా కుంభమేళా సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కుంభమేళాలో యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడంతో సమాజ్వాదీ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ములాయం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో సాధువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ములాయం సింగ్ యాదవ్ స్మృతి సేవా సంస్థాన్ సెక్టార్ 16లోని శిబిరంలో ఏర్పాటు చేశారు. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో ఉన్న ములాయం విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించినట్లు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మాతా ప్రసాద్ పాండే ఆదివారం తెలిపారు.
అయితే ములాయం విగ్రహా ఏర్పాటును అఖిల భారతీయ అఖార పరిషత్ తీవ్రంగా విమర్శించారు. పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి మాట్లాడుతూ.. ములాయం సింగ్ యాదవ్ హిందూ వ్యతిరేకి అని మండిపడ్డారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన పని చేశారని విమర్శలు గుప్పించారు. ములాయం విగ్రహం ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు.. ఆయన యూపీకి సీఎంగా పని చేశారు. కానీ మహా కుంభమేళాలో ములాయం విగ్రహాన్ని ప్రతిష్టించడం సరికాదు. ఈ విగ్రహా ఏర్పాటుతో యూపీలో ఆయన చేసిన అరాచకాలు, అల్లర్లు, మతవిద్వేషాలు గుర్తుకు వచ్చేలా ఉందన్నారు. ఈ దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఎస్పీ నేతలు. రామమందిర ఉద్యమంలో ఆయన సహకారం ఏమిటో అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడూ హిందూ వ్యతిరేకి, సనాతన ధర్మానికి వ్యతిరేకి అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..