తెలంగాణ/ఏ.పీ, 13 జనవరి (హి.స.)
ప్రయోగ్ రాజ్ – ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా వేడుక ఘనంగా ప్రారంభమైంది. త్రివేణీ సంగమ క్షేత్రంలో పవిత్ర స్నానమాచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. తొలి రోజున తొలిరోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజ స్నానం చేసేందుకు భక్తలు పోటెత్తారు.. ప్రతి స్నానఘట్టం భక్త జనంతో కిటకిటలాడాయి ..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహా కుంభ 45 రోజుల పాటు సాగనుంది.. పిబ్రవరి 25 వ తేదీన మహా శివరాత్రి రోజున రాజ స్నానంతో ఈ వేడుక ముగుస్తుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచయి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారని గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని భావిస్తున్నారు. . తొలి రోజున ఏకంగా నాలుగు ప్రధాన స్నానఘట్టాలలో 90 లక్షల మంది రాజస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..