హైదరాబాద్, 13 జనవరి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో పాల్గొన్నారు.సంఘం ఛైర్మన్ తట్కరే సునీల్ దత్తాత్రేయ్ అధ్యక్షతన ముంబాయి కొలాబాలోని తాజ్ హోటల్ కన్వెన్షన్ హాలులో సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా అధికారులు ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించారు.చమురు శుద్ధి కర్మాగారాలలో నెలకొన్న సౌకర్యాలు,మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవలసిన చర్యలు,మూడేళ్లుగా వాటి పనితీరు గురించి ఈ సందర్భంగా స్థాయి సంఘం సమీక్షించింది.పెట్రోల్, డీజీల్,వాటి సంబంధిత ఉత్పత్తులు,వంట గ్యాస్ ధరలు, రవాణా, మార్కెటింగ్,ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన ముందస్తు జాగ్రత్తలు,చర్యలు,వినియోగదారుల అవసరాలు,మరిన్ని మెరుగైన సేవల్ని అందుబాటులోకి తెచ్చే అవకాశాలు తదితర అంశాలపై ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు చర్చించారు.ఈ సమావేశంలో స్థాయి సంఘం సభ్యులతో పాటు పెట్రోలియం ,సహజ వాయువు శాఖ, హెచ్పీసీఏల్,బీపీసీఏల్,ఐఓసీఏల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు