తెలుగువారు మూడట్ రోజులందంక్రంటి పండుగల్లో  తొలిరోజైన.భోగి పండుగ రోజు మూడు.కోట్ల.కోడి పందేలు
విజయవాడ, 14 జనవరి (హి.స.) తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనూ కోడి పందేలు
 తెలుగువారు మూడట్ రోజులందంక్రంటి పండుగల్లో  తొలిరోజైన.భోగి పండుగ రోజు మూడు.కోట్ల.కోడి పందేలు


విజయవాడ, 14 జనవరి (హి.స.)

తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనూ కోడి పందేలు జోరుగా సాగాయి. మూడు రోజుల పండుగలో తొలిరోజే సుమారు రూ.300 కోట్ల మేరకు పందెం రాయుళ్లు పందేలొడ్డడం గమనార్హం. గోదావరి జిల్లాల్లో వేసిన భారీ బరులను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పలు బరుల్లో పలువురు ప్రజాప్రతినిధులు సైతం సందడి చేశారు. కోడి పందేలను వీక్షించిన వారు కొందరైతే.. నేరుగా కోళ్లతో పందేలకు దిగిన వారు మరికొందరు! వెరసి భోగి వైభోగంగా జరిగిపోయింది!!

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande