ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. తిరుపతి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి..
హైదరాబాద్, 14 జనవరి (హి.స.)తిరుపతిలో తొక్కిసలాట ఘటన కలకలం రేపుతోంది.. అయితే, సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన జరిగిందని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఆ వేంకటేశ్వరుని దయతో దర
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. తిరుపతి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి..


హైదరాబాద్, 14 జనవరి (హి.స.)తిరుపతిలో తొక్కిసలాట ఘటన కలకలం రేపుతోంది.. అయితే, సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన జరిగిందని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఆ వేంకటేశ్వరుని దయతో దర్శనాలు చేసుకుని వెళ్తారన్నారు.. కూటమి ప్రభుత్వం జరిగిన ఘటనపై స్పందించిన తీరు సరికాదని.. క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమన్నారు.. బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. టీటీడీ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే బాధితులకు న్యాయం చేసినట్లవుతుందన్నారు.. ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande