హైదరాబాద్, 14 జనవరి (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మంగళవారం లాభాల్లో ముగిశాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఆటో, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 23,150 ఎగువన ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 76,330.01 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,835.61 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 169 పాయింట్ల లాభంతో 76,499.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 23,165.90 వద్ద లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఇంట్రాడేలో 23,264.95 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 90 పాయింట్ల లాభంతో 23,176 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.64 వద్ద స్థిరపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు