సత్యదేవుని సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తులు
కాకినాడ, 14 జనవరి (హి.స.)కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్టి, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్, జస్టిస్‌ రాజేష్‌ బిందాల్, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సోమవారం దర్శించ
సత్యదేవుని సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తులు


కాకినాడ, 14 జనవరి (హి.స.)కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్టి, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్, జస్టిస్‌ రాజేష్‌ బిందాల్, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సోమవారం దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అతిథిగృహం వద్ద జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా అదనపు న్యాయమూర్తి పి.కమలాదేవి, తుని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.బాలకోటేశ్వరరావు, ఆర్డీవో శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజు, ఈవో సుబ్బారావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తులు మండపంలో సత్యదేవుని వ్రతమాచరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం, ఈవో స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande