సైబర్ నేరగాళ్లు ఓదారబెట్ట.ప్రైవేటు ఉద్యోగి.నుంచి 2.43,కోట్లు  దోచేశారు
విజయవాడ, 14 జనవరి (హి.స.), హైదరాబాద్‌: పెట్టుబడులకు భారీగా లాభాలు, స్టాక్‌ ట్రేడింగ్‌ పేరుతో వలేసిన సైబర్‌ నేరగాళ్లు వేర్వేరు ఘటనల్లో ఇద్దరి నుంచి రూ.2.43 కోట్లు కొట్టేశారు. ఓ వ్యక్తి వ్యక్తిగత రుణం తీసుకుని మరీ డబ్బు పంపడం గమనార్హం. ఓ జాతీయ పరిశోధన
సైబర్ నేరగాళ్లు ఓదారబెట్ట.ప్రైవేటు ఉద్యోగి.నుంచి 2.43,కోట్లు  దోచేశారు


విజయవాడ, 14 జనవరి (హి.స.), హైదరాబాద్‌: పెట్టుబడులకు భారీగా లాభాలు, స్టాక్‌ ట్రేడింగ్‌ పేరుతో వలేసిన సైబర్‌ నేరగాళ్లు వేర్వేరు ఘటనల్లో ఇద్దరి నుంచి రూ.2.43 కోట్లు కొట్టేశారు. ఓ వ్యక్తి వ్యక్తిగత రుణం తీసుకుని మరీ డబ్బు పంపడం గమనార్హం. ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఫోన్‌ నెంబరును గుర్తుతెలియని వ్యక్తులు డిసెంబరు చివరివారంలో ఓ వాట్సాప్‌ గ్రూపులో చేర్చారు. స్టాక్‌ ట్రేడింగ్‌ చేస్తే బాగా డబ్బు వస్తుందని, తాము సలహాలు కూడా ఇస్తామని గ్రూపులో సందేశాలు పెట్టేవారు. ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త వారు చెప్పినట్లు యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ పేరుతో ఉన్న యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. షేర్లు కొనుగోలు చేసి నాలుగైదు రోజుల తర్వాత మంచి ధర రాగానే విక్రయించాలని సూచించారు. షేర్లు కొనుగోలు చేయించి డబ్బు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేయించుకునేవారు.

తొలిసారి షేర్లు కొన్నందుకు శాస్త్రవేత్తకు రూ.50 వేల లాభం వచ్చింది. ఇదంతా నిజమేనని నమ్మి భారీగా లాభాలు వస్తాయని భావించిన శాస్త్రవేత్త డిసెంబరు 24 నుంచి 18 రోజుల వ్యవధిలో 16 లావాదేవీల్లో 1.22 కోట్లు నేరగాళ్లకు పంపించాడు. డబ్బు సర్దుబాటు కాకపోతే వ్యక్తిగత రుణం తీసుకుని మరీ నేరగాళ్లకు పంపాడు. ఈ పెట్టుబడి లాభంతో కలిపి రూ.3.26 కోట్లకు చేరినట్లు నకిలీ యాప్‌లో వర్చువల్‌గా కనిపించినా విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. వాట్సాప్‌ ద్వారా సంప్రదించగా ఇప్పుడే విత్‌డ్రా వద్దని, లాభం మరింత రావాలంటే ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ నేరగాళ్లు మెలికపెట్టారు. డబ్బు విత్‌డ్రాకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తే.. అదనంగా రూ.కోటి పంపాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో శాస్త్రవేత్త సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande