డ్రైవర్ చాకచక్యంతో  మంత్రి పొంగులేటికి  తప్పిన ప్రమాదం..
తెలంగాణ/ఖమ్మం 13 జనవరి (హి.స.) తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాహనం రెండు టైర్లు అకస్మాత్తుగా పగిలిపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వాహనం అదుపు తప్పినా డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదాన్ని నివారించగలిగాడు. వరంగల్ నుంచి ఖమ్మ
పొంగులేటి


తెలంగాణ/ఖమ్మం 13 జనవరి (హి.స.)

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాహనం రెండు టైర్లు అకస్మాత్తుగా పగిలిపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వాహనం అదుపు తప్పినా డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదాన్ని నివారించగలిగాడు. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా తిరుమలాయపాలెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాకపోవడంతో మంత్రిని వెంటనే మరో కారులో ఎక్కించి సురక్షితంగా ఖమ్మం తరలించారు. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్ వరంగల్ పర్యటనకు వెళ్తుండగా జనగాంలోని పెంబర్తి కళాతోరణం సమీపంలో పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. జనగాం సన్ఇన్స్పెక్టర్, ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలు కాగా, విక్రమార్క క్షేమంగా ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డిప్యూటీ ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande