ఢిల్లీ - 13 జనవరి (హి.స.)చైనాతో సరిహద్దులు పంచుకొంటున్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి సున్నితంగా కొనసాగుతున్నా.. స్థిరంగానే ఉందని ఆర్మీ చీఫ్ (Indian Army Chief) జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో డెప్సాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ మొదలైందని తెలిపారు. న్యూదిల్లీలో నిర్వహించిన వార్షిక ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
భారత సైన్యం మోహరింపులు బలంగా, సమతౌల్యంతో ఉన్నాయని ద్వివేది చెప్పారు. ఎటువంటి పరిస్థితినైనా సైన్యం ఎదుర్కోగలదన్నారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడంతోపాటు.. సామర్థ్యాలను బలపరుస్తున్నట్లు చెప్పారు.
ఇక పాకిస్థాన్ వైపు ఉన్న నియంత్రణ రేఖ వద్ద చొరబాటు యత్నాలను అడ్డుకొంటున్నట్లు ద్వివేది వెల్లడించారు. పాక్ వైపు ఉగ్ర స్థావరాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు