ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు  కురువనున్నట్లు.భారత వాతావరణ శాఖ తెలిపింది
విజయవాడ, 15 జనవరి (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. సోమవరం నాడు చిత్తూరు, తి
 ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు  కురువనున్నట్లు.భారత వాతావరణ శాఖ తెలిపింది


విజయవాడ, 15 జనవరి (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. సోమవరం నాడు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడగా.. మంగళవారం చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో వానలు పడతాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తర కోస్తా ప్రాంతాలు, అలాగే యానాంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ ఒకట్రోండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఇక, రాయసీమ విషయానికి వస్తే నేడు ఒకట్రోండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande