చిత్తూరు, 15 జనవరి (హి.స.)
:ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( తెలిపారు. రాష్ట్ర ప్రజలు వాటిలో కేవలం 350 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని ఆయన చెప్పారు. నీళ్లు ఉంటే రాయలసీమ ) రతనాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండగకు కుటుంబసమేతంగా నారావారిపల్లె వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్థానిక టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల