చిత్తూరు 15 జనవరి (హి.స.)
:జనవరి 18న వాట్సాప్ గవర్నెర్స్ తీసుకురాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులు ఆన్‌లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ఆన్‌లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబసమేతంగా నారావారిపల్లెకు ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇవాళ (మంగళవారం) టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల