ధా వొస్ లో సిఎం.చంద్రబాబు.పర్యటన.కొనసాగుతోంది
విజయవాడ, 21 జనవరి (హి.స.)దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతి
ధా వొస్ లో సిఎం.చంద్రబాబు.పర్యటన.కొనసాగుతోంది


విజయవాడ, 21 జనవరి (హి.స.)దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి, భేటీలు నిర్వహించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ - గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు - రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ ఈరోజు సీఎం భేటీకానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande