‌జిల్లా.కలెక్టర్ల ఉన్నతాధికారుల  సమావేశంలో ఆన్ లైన్ లో.  రెమీ.ఆడుతూ  పట్టుబడ్డ   డీఎర్వో
అనంతపురం, 21 జనవరి (హి.స.) జిల్లా కలెక్టరేట్‌‌లో జరుగుతున్న ఉన్నతాధికారుల సమావేశంలో డీఆర్‌వో మలోల ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్
‌జిల్లా.కలెక్టర్ల ఉన్నతాధికారుల  సమావేశంలో ఆన్ లైన్ లో.  రెమీ.ఆడుతూ  పట్టుబడ్డ   డీఎర్వో


అనంతపురం, 21 జనవరి (హి.స.)

జిల్లా కలెక్టరేట్‌‌లో జరుగుతున్న ఉన్నతాధికారుల సమావేశంలో డీఆర్‌వో మలోల ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్న డీఆర్ఓ మలోలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సమావేశ మందిరంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఎందుకు ఆడాల్సి వచ్చింది.. అనే దానిపై డీఆర్ఓ మలోలను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. డీఆర్ఓ‌ను విచారించాల్సిందిగా జాయింట్ కలెక్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డీఆర్ఓ మలోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande