గ్రామాలలో కుల గణన, వర్గీకరణసంబరాలు చేయాలి..  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
తెలంగాణ, 5 ఫిబ్రవరి (హి.స.) గ్రామాలలో కుల గణన, వర్గీకరణ సంబరాలు చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం మాట్లాడుతూ.., నిన్న శాసనసభలో రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం మ
మహేష్ కుమార్ గౌడ్..


తెలంగాణ, 5 ఫిబ్రవరి (హి.స.) గ్రామాలలో కుల గణన, వర్గీకరణ సంబరాలు చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం మాట్లాడుతూ.., నిన్న శాసనసభలో రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎన్నో ఏళ్ళు గా పెండింగ్ లో ఉన్న బిసి కులఘనన ను, ఎస్సీల వర్గీకరణ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. సమాజంలో రెండు ప్రధాన వర్గాలు బిసిలు, ఎస్సీ లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కులఘనన, వర్గీకరణ కార్యక్రమాలు కార్యాచరణకు సిద్ధమయ్యాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అన్ని గ్రామాలలో, మండలాలలో, నియోజక వర్గాలలో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉప సంఘం చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి కు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు భారీ ఎత్తున నిర్వహించాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande