తెలంగాణ/ఏ.పీ, 5 ఫిబ్రవరి (హి.స.)
నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. యాదవులు బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. తెలంగాణ లోని బీజేపీ పార్టీ ఇటీవల జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టింది. ఈ జిల్లా అధ్యక్షుల పదవుల్లో తమ సామాజిక వర్గానికి ఒక్క పదవికి కూడా ఇవ్వలేదని యాదవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాదవ సంఘం నాయకులు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. యాదవ సోదరులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
దీంతో బీజేపీ ఆఫీస్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా జై యాదవ్ బీజేపీ డౌన్ డౌన్ అని యాదవ సోదరులు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేగాక తెలంగాణలోని బీసీల లో ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలలో ఒకటిగా ఉన్న తమని బీజేపీ గుర్తించకపోవడం పట్ల అసహం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..