మహబూబాబాద్ జిల్లాలో డాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి..
తెలంగాణ, 5 ఫిబ్రవరి (హి.స.) మహబూబాబాద్ జిల్లాలో డాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు.ఈ సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్
విద్యార్థిని మృతి


తెలంగాణ, 5 ఫిబ్రవరి (హి.స.) మహబూబాబాద్ జిల్లాలో డాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు.ఈ సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ వేస్తూ రోజా అనే ఇంటర్ ఫస్టియర్ సీఈసీ విద్యార్ధిని కుప్పకూలింది.. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు... చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందినది.. విద్యార్ధిని స్వస్థలం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు సపవత్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande