రేపటి నుండి ప్రారంభం కానున్న జేఈఈ మెయిన్స్ – 2025 సెషన్ – 1 పరీక్షలు.
తెలంగాణ/ఏ.పీ, 21 జనవరి (హి.స.) జేఈఈ మెయిన్స్ – 2025 సెషన్ – 1 పరీక్షలు రేపటి (బుధ‌వారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐఐటీలతో పాటు పలు ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం జేఈఈ పరీక
జేఈఈ మెయిన్ పరీక్షలు


తెలంగాణ/ఏ.పీ, 21 జనవరి (హి.స.)

జేఈఈ మెయిన్స్ – 2025 సెషన్ – 1 పరీక్షలు రేపటి (బుధ‌వారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐఐటీలతో పాటు పలు ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష రాసే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్‌టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులు కచ్చితంగా అడ్మిట్ కార్డును తీసుకెళ్లాలి. లేకపోతే పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఫొటోతో కూడిన గుర్తింపు కార్డును చూపించాలి. ఆధార్, రేషన్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు… వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకుని వెళ్లాలి. ఇక‌.. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసినప్పుడు అప్ లోడ్ చేసిన పాస్ పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande