తెలంగాణ, ఖమ్మం. 21 జనవరి (హి.స.) గ్రామ సభలో ప్రకటించిన లిస్టు నందు పేరు రాలేదని ఎవరు దిగులు చెందొద్దు అని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. తెలంగాణ రాష్ట్రం జనవరి 26న ప్రవేశ పెట్టబోయే నాలుగు పథకాలపై ప్రజా పాలన- గ్రామసభలు నిర్వహించగా ముదిగొండ మండలంలో మంగళవారం నుండి పలు గ్రామాలలో గ్రామసభలు మొదలయ్యాయి కాగా మేడేపల్లి గ్రామంలోని గ్రామసభకు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ _ గ్రామాలలో కార్యదర్శులు స్వయంగా వెళ్లి స్థలం ఉండి ఇల్లు లేని వారు, స్థలం ఇల్లు లేని వారు పేర్లు నివేదిక తయారు చేశారు.
ఈ నివేదికపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేస్తే మరల సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఎవరు గొడవలు పెట్టుకోవద్దని, మీ పేరు రాలేదని దిగులు చెందకుండా ఏమైనా సమస్యలు ప్రతి గ్రామాలలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసాము వాటిని ప్రజల వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్