దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది-అమిత్‌ షా
ఢిల్లీ- , 21 జనవరి (హి.స.)ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఇప్పటికీ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) స్పందించారు. ఇది నక్సల్స్‌ లేని భారత
దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది-అమిత్‌ షా


ఢిల్లీ- , 21 జనవరి (హి.స.)ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఇప్పటికీ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) స్పందించారు. ఇది నక్సల్స్‌ లేని భారత్ దిశగా కీలక అడుగని వ్యాఖ్యానించారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.

‘‘ఇది నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ. మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయం. నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇది ఓ కీలక అడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది. సీఆర్‌పీఎఫ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బలగాలు ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో భాగమయ్యాయి’’ అని అమిత్‌ షా స్పందించారు.

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడలో జనవరి 19 రాత్రి నుంచి ఈ ప్రత్యేక ఆపరేషన్ జరుగుతోంది. పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande