మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం
ముంబై,, 4 ఫిబ్రవరి (హి.స.)మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మ
మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం


ముంబై,, 4 ఫిబ్రవరి (హి.స.)మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో మాత్రమే ఇతర భాషలను మాట్లాడాలని పేర్కొంది. మరాఠీ వాళ్లతో మాత్రం మరాఠీనే మట్లాడాలని పేర్కొంది.

ఎవరైనా ప్రభుత్వ అధికారి ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే.. అవసరమైన చర్య కోసం కార్యాలయం లేదా డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జికి అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఇది అధికారిక క్రమశిక్షణా రాహిత్య చర్యగా పరిగణించి, ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యతో ఫిర్యాదుదారు సంతృప్తి చెందకపోతే, ఫిర్యాదుదారు మహారాష్ట్ర శాసనసభలోని మరాఠీ భాషా కమిటీ ముందు దాని గురించి అప్పీల్ చేయవచ్చని స్పష్టం చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande