హైదరాబాద్, 5 ఫిబ్రవరి (హి.స.)శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-తిరుపతి విమానం రద్దు కావడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. సాంకేతిక లోపంతో హైదరాబాద్-తిరుపతి ఎయిర్‌వేస్ విమానం రద్దయింది. ఈ విషయాన్ని సిబ్బంది చివరి నిమిషంలో చెప్పారు. (Hyderabad News)
దీంతో ప్రయాణికులు 4 గంటలుగా విమానాశ్రయంలోనే వేచిఉన్నారు. తిరుమల దర్శన సమయం దాటిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 47 మందితో ఈ విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. (Telangana News) ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అలియన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 91877 విమాన సర్వీసు ఎప్పటిలా ఉదయం 9 గంటలకు 47 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరింది. రన్‌వే వైపు వెళ్తుండగా ఇంజిన్‌లో చోటు చేసుకున్న సాంకేతిక లోపాన్ని పైలట్ గమనించి ఏటీసీ అధికారులకు సమాచారం అందించాడు. భారీ మరమ్మతుల కారణంగా సర్వీసును రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు