అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు.. 
ఢిల్లీ, 5 ఫిబ్రవరి (హి.స.)దేశం చూపు ఇప్పుడు ఢిల్లీపై పడింది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పోలిం
Kejriwal


ఢిల్లీ, 5 ఫిబ్రవరి (హి.స.)దేశం చూపు ఇప్పుడు ఢిల్లీపై పడింది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. కేసుకు గల కారణం ఏంటంటే యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హర్యానాలో కేసు నమోదైంది.

ఇటీవల కేజ్రీవాల్ యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విషం కలిపిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. అయితే కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గట్టిగానే స్పందించారు. ఏకంగా యమునా నీటిని తాగి విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ సైతం కేజ్రీవాల్ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చారు. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande