త్రివేణి సంగంలో మోడీ పుణ్య స్నానం … గంగ‌కు ప్ర‌త్యేక పూజ‌లు
తెలంగాణ/ఏ.పీ, 5 ఫిబ్రవరి (హి.స.) నేడు ప్రధాని మోదీ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగ‌మం ఘాటు వ‌ద్ద ఆయ‌న పుణ్య స్నాన‌మాచ‌రించారు.. గంగ‌మ్మ కు ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.ముందుగా ఆయ‌న ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో బమ్రౌలి విమానాశ్రయానికి చే
మోడీ పుణ్య స్థానం


తెలంగాణ/ఏ.పీ, 5 ఫిబ్రవరి (హి.స.)

నేడు ప్రధాని మోదీ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగ‌మం ఘాటు వ‌ద్ద ఆయ‌న పుణ్య స్నాన‌మాచ‌రించారు.. గంగ‌మ్మ కు ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.ముందుగా ఆయ‌న ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో బమ్రౌలి విమానాశ్రయానికి చేరుకున్నారు.. అక్క‌డ నుంచి ఆయ‌న కారులో కుంభ‌మేళాకు చేరుకున్నారు. అనంత‌రం ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య నాథ్ లో క‌ల‌సి ప‌డ‌వ‌లో అరయిల్ ఘాట్ నుండి త్రివేణి సంగ‌మం వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ ఆయ‌న పుణ్య స్నాన‌మాచ‌రించారు. అనంతరం ఆయన అఖారాలు, ఆచార్యవాడ, దండివాడ, ఖాక్‌చౌక్ ప్రతినిధులను క‌లిశారు.. వారితో కొత్త సేపు మాట్లాడారు.. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande