ఢిల్లీతో సహా మరో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
ఢిల్లీ, 5 ఫిబ్రవరి (హి.స.)ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్‌‌, తమిళనాడులోని ఈరోడ్‌ (ఈస్ట్‌) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి
ఢిల్లీతో సహా మరో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్


ఢిల్లీ, 5 ఫిబ్రవరి (హి.స.)ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్‌‌, తమిళనాడులోని ఈరోడ్‌ (ఈస్ట్‌) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇక, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో ఉత్తరప్రదేశ్ లోని మల్కిపురిలో బైపోల్ అనివార్యమైంది. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన మిల్కిపూర్‌ నుంచి గత ఎన్నికల్లో అవదేశ్‌ ప్రసాద్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫైజాబాద్‌ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచాడు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ రోజు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉండగా.. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande