ఆన్.లైన్.బెట్టింగ్.లో  లక్షలు కు పైగా అప్పుల్లో. కూరుకుపోయి  వాటిని తీర్చే మార్గం తెలియక  ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
విజయవాడ, 21 జనవరి (హి.స.) ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయి.. వాటిని తీర్చే మార్గం తెలియక ప్రాణాలు తీసుకోడానికి కూడా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌‌ చేసి లక్షలకు
 ఆన్.లైన్.బెట్టింగ్.లో  లక్షలు కు పైగా అప్పుల్లో. కూరుకుపోయి  వాటిని తీర్చే మార్గం తెలియక  ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు


విజయవాడ, 21 జనవరి (హి.స.)

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయి.. వాటిని తీర్చే మార్గం తెలియక ప్రాణాలు తీసుకోడానికి కూడా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌‌ చేసి లక్షలకు పైగా డబ్బులు పోగోట్టుకున్నాడు. చివరకు అప్పుల బాధతో యువకుడు తీసుకున్న నిర్ణయం ఇంట్లో విషాదాన్ని నింపింది. ఇంతకీ యువకుడు చేసిన పనేంటి.. ఆన్‌లైన్‌లో ఎంత పోగొట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

జిల్లాలోని నరసరావుపేటలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు ఓ యువకుడు బలయ్యాడు. పట్టణంలోని ప్రకాష్ నగర్‌లో ఉంటున్న కనుపోలు ఉదయ్ కిరణ్(32) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఉదయ్‌ కిరణ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌లో దాదాపు రూ.10 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు యువకుడు. బెట్టింగ్‌ల కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేసిన యువకుడు.. చివరకు ఉన్నదంతా పోవడంతో అప్పులు తీర్చలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande