భూపాలపల్లి, 2 అక్టోబర్ (హి.స.)
మహాత్మా గాంధీ చూపిన అహింస,
శాంతి మార్గం ద్వారానే సమాజంలో ఉన్న సమస్యలు, విభేదాలు, ఒత్తిడులను అధిగమించవచ్చని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాక, అహింసా సిద్ధాంత పితామహుడని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో ఆయన చూపిన మార్గం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..