హైదరాబాద్, 2 అక్టోబర్ (హి.స.)
జాతిపిత మహాత్మా గాంధీ 156 వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి బాపూఘాట్లో బాపు సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ప్రత్యేక నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ రాజ్యసభసభ్యులు హనుమంతరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, పర్యాటకశాఖ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, అడిషనల్ సీపీ తాప్సీర్ ఎక్బాల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు కాగా అంతకుముందు గాంధీ మ్యూజియం హాల్లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు