హైదరాబాద్, 2 అక్టోబర్ (హి.స.)
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (83)కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లుగా ప్రధాని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు