అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండంలోని సూరంపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ రవాణాకు కేంద్రంగా గన్నవరం మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా అక్రమ రేషన్ నిల్వలు చూసి స్థానికులు ఖంగుతిన్నారు. 50 కేజీల బరువైన 500 బస్తాలను రేషన్ దొంగలు అక్రమంగా నిల్వ చేశారు. గన్నవరం పోలీసులు, సివిల్ సప్లై అధికారులు మెరుపుదాడులు చేసి పట్టుకున్నారు. రేషన్ వ్యాపారిపై నమోదు చేసి బియ్యం బస్తాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ