శ్రీవారి.బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు. తుడుడు చైర్మన్ బీవర్ నాయుడు.తెలిపారు
అమరావతి, 2 అక్టోబర్ (హి.స.) తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలకు తితిదే ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16 వాహన సేవలు, మూలమూర్తి దర్శనం
శ్రీవారి.బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు. తుడుడు చైర్మన్ బీవర్ నాయుడు.తెలిపారు


అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలకు తితిదే ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16 వాహన సేవలు, మూలమూర్తి దర్శనం నిర్వహించినట్లు తెలిపారు. గరుడసేవ రోజున అదనంగా 45,000 మందికి దర్శనం కల్పించినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ఇప్పటివరకు 5.80 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా.. స్వామివారి హుండీకి రూ.25.12 కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపారు.

మొత్తంగా 26 లక్షల మందికి అన్నప్రసాదం పంపిణీ చేయగా.. 28లక్షలకు పైగా లడ్డూల విక్రయం జరిగినట్లు తితిదే ఛైర్మన్‌ వెల్లడించారు. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారన్నారు. 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలు (6,976 కళాకారులు), గరుడసేవ రోజు 20 రాష్ట్రాల నుంచి 37 బృందాలు (780 కళాకారులు) సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులు, 50 మంది వైద్యులు, 60మంది పారామెడికల్‌ సిబ్బంది, 14 అంబులెన్సులతో భక్తులకు సేవలందించామన్నారు. వీటితో పాటు 4,000 మంది పోలీస్, 1,800 మంది విజిలెన్స్ సిబ్బంది; గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారని వివరించారు. 2800 మంది పారిశుద్ధ్య సిబ్బంది, గరుడ సేవ రోజున అదనంగా 650 మంది సేవలందించారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande